by Suryaa Desk | Thu, Jan 16, 2025, 03:30 PM
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అఖండ 2: తాండవం'.ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో 'అఖండ 2: తాండవం కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. దీనిని ఉద్దేశించి తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు.'మహా కుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. మాది అఘోరా నేపథ్యంలో సాగే కథ. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ రోజుతో ఇక్కడ షూట్ పూర్తవుతుంది. నాగసాధువులు, అఘోరాలను కలిశాం. మా ప్రయత్నలోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా శ్రమిస్తున్నాం'' అని బోయపాటి శ్రీను చెప్పారు.2021లో విడుదలైన 'అఖండ'కు కొనసాగింపుగా 'అఖండ 2: తాండవం' సిద్ధమవుతోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పకురాలు. సంచలన విజయం సాధించిన 'అఖండ'కి దీటుగా, భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ''బాలకృష్ణ - బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రమిది. యాక్షన్, బలమైన డ్రామా మేళవింపుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. అంచనాలకి తగ్గట్టుగానే సినిమా ఉంటుంద''ని చిత్రవర్గాలు స్పష్టం చేశాయి. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకురానుంది. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
Latest News