by Suryaa Desk | Thu, Jan 16, 2025, 04:56 PM
చిత్రనిర్మాత-నటుడు ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ఓహ్ మై కడవులే ఫేమ్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'డ్రాగన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క డ్రీమ్ సాంగ్ ని మధువారమే అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాంకేతిక సిబ్బందిలో లియోన్ జేమ్స్ (సంగీతం), నికేత్ బొమ్మి (సినిమాటోగ్రఫీ), ప్రదీప్ రాఘవ్ (ఎడిటింగ్) ఉన్నారు. ఈ ద్విభాషా చిత్రం, తమిళం మరియు తెలుగులో విడుదలవుతుంది. ప్రదీప్ రంగనాథన్ మరియు అశ్వత్ మరిముత్తుల మధ్య ఉత్తేజకరమైన సహకారాన్ని అందిస్తుంది. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News