by Suryaa Desk | Thu, Jan 16, 2025, 04:12 PM
జనవరి 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ‘డాకు మహారాజ్’ తాజాగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. రిలీజ్ అయిన మొదటి రోజే రూ.56 కోట్లు కలెక్షన్స్ రాబట్టి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక నాలుగు రోజులకే రూ.105 కోట్లు వసూళ్లు సాధించినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ కలెక్షన్స్‌తో వరుసగా నాలుగు సార్లు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్‌తో బాలయ్య రికార్డు క్రియేట్ చేశాడు.వంద కోట్ల క్లబ్‌లోకి ‘డాకు మహారాజ్’.బాలయ్య కెరీర్‌లో ఇంత వేగంగా ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమా డాకు మహారాజ్ కావడం విశేషం. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజ్ వంద కోట్ల క్లబ్‌లో చేరి బాలయ్య సరికొత్త రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ సక్సెస్ ఫుల్గా థియేటర్స్లోదూసుకెళ్తోంది.
Latest News