by Suryaa Desk | Fri, Jan 17, 2025, 10:35 AM
పెద్ద పండగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్‌టైనర్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లో రూ.77 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ రూ.100 కోట్ల మార్కు దాటడం ఖాయం. రేపో మాపో ఆ పోస్టర్ కూడా పడిపోతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో మూవీకున్న డిమాండ్ అలాంటిది. సంక్రాంతి సెలవులు కావడంతో కుటుంబాలతో కలిసి జనాలు థియేటర్‌లకు క్యూ కడుతున్నారు. అన్ని షోలు దాదాపు హౌస్‌ఫుల్‌తో నడుస్తున్నాయి. ఈ క్రమంలో సినిమాకు వస్తున్న ఆదరణ దృష్ట్యా ఏపీ, తెలంగాణల్లో అదనంగా 220+ షోలను ప్రదర్శించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది.
Latest News