by Suryaa Desk | Fri, Jan 17, 2025, 03:52 PM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతనిని బాంద్రాలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దాడి చేయడానికి గల కారణాలను వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.గురువారం వేకువజామున రెండున్నర గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి జొరబడిన దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. సైఫ్ అలీఖాన్ అడ్డుకునే ప్రయత్నం చేయగా దాడి చేసి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు 20 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.
Latest News