by Suryaa Desk | Fri, Jan 17, 2025, 04:15 PM
బన్నీ ఫ్యాన్స్ కు శుభవార్త! నేటి నుంచి ఎక్స్ ట్రా ఫుటేజితో కూడిన పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ ను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. రెగ్యులర్ నిడివికి అదనంగా మరో 20 నిమిషాల ఆటను జోడించి ఈ రీలోడెడ్ వెర్షన్ ను రూపొందించారు. అదనపు ఫుటేజితో పుష్ప-2 మరింత ఫైరీగా మారిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. "పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ ను ఈ రోజు నుంచి అందిస్తున్నాం. అదనపు ఫుటేజితో కూడిన పుష్ప-2 చిత్రంతో మీరందరూ సరికొత్త అనుభూతి పొందుతారని భావిస్తున్నాను" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్రా ఫుటేజిలోని ఓ స్టిల్ ను కూడా అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. వాస్తవానికి ఈ రీలోడెడ్ వెర్షన్ ను జనవరి 11 నుంచే ప్రదర్శిస్తారని చిత్రబృందం ఇంతకుముందు ప్రకటించింది. అయితే, అనివార్య కారణాలతో ఆ నిర్ణయం వాయిదా పడింది. తాజాగా, నేటి (జనవరి 17) నుంచి ఈ రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలోకి వస్తుందని చిత్రబృందం అనౌన్స్ చేసింది.
Latest News