by Suryaa Desk | Fri, Jan 17, 2025, 07:41 PM
సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల వార్తల కంటే మంచు కుటుంబంలో మలుపులు తిరుగుతున్న వివాదమే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వెళ్లడంతో మరోసారి వివాదం రాజుకుంది. ఇరు పక్షాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడంతో ఈరోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓవైపు మంచు ఫ్యామిలీ వివాదం ముదిరిన తరుణంలో సోషల్ మీడియాలో మంచు విష్ణు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తాను నటించిన 'రౌడీ' సినిమాలోని ఓ డైలాగ్ ఆడియోను ఆయన పోస్ట్ చేశారు. తన ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారని తన ఫేవరెట్ డైలాగ్స్ లో ఇది ఒకటి అని చెప్పారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి... అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్ ను షేర్ చేశాడు. మంచు మనోజ్ తో వివాదం కొనసాగుతున్న వేళ... విష్ణు షేర్ చేసిన డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ మనోజ్ ను ఉద్దేశించేనా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Latest News