|
|
by Suryaa Desk | Mon, Mar 17, 2025, 03:10 PM
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా భారీ అంచనాలున్న మలయాళ చిత్రం 'ఎల్2 ఎంపురాన్' మార్చి 27, 2025న థియేటర్లలోకి రానుంది. లూసిఫెర్ ఫ్రాంచైజీలో L2 ఎంపురాన్ రెండవ విడత. మోహన్‌లాల్ తన ఐకానిక్ పాత్రలో స్టీఫెన్ నెడుంపల్లి అకా ఖురేషి అబ్రమ్‌గా నటించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగురాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్ మరియు అర్జున్ దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేయగా, దీపక్ దేవ్ సంగీతం సమకూర్చారు. అఖిలేష్ మోహన్ ఎడిటర్ గా ఉన్నారు. ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మలయాళ పరిశ్రమలో చాలా అంచనాలు ఉన్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా, L2 ఎంపురాన్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ఆంటోని పెరుంబవూర్ మరియు అల్లిరాజా సుభాస్కరన్ సంయుక్తంగా ఎల్ 2 ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు.
Latest News