|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 10:52 AM
టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. "మంగళసూత్రం వేసుకోవడం లేదా వద్దనుకోవడం నా భార్య చిన్మయి ఇష్టం" అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. "పురుషులకు వివాహ సంకేతాలు లేకపోవడం అన్యాయం. అలాగే మహిళలకు పెళ్లి అయినట్టు సంకేతం ఉండటం సరికాదు. పురుషులు, స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Latest News