|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 05:14 PM
మంచు కుటుంబంలో గత కొంతకాలంగా జరుగుతున్న విభేదాల ప్రచారంపై నటి, నిర్మాత మంచు లక్ష్మి తీవ్రంగా స్పందించారు. తన సోదరులు విష్ణు, మనోజ్‌ల మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్న వారు నాశనమైపోతారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు తమ కుటుంబం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మనోజ్ నటించిన 'మిరాయ్' సినిమా ఈవెంట్‌లో తాను మాట్లాడిన మాటలను కత్తిరించి, వక్రీకరించి ప్రచారం చేశారని లక్ష్మి ఆరోపించారు. "ఆ ఈవెంట్‌లో నేను విష్ణు గురించి మాట్లాడకపోయినా, అతడిని తిట్టినట్లుగా థంబ్‌నైల్స్ పెట్టి తప్పుగా చూపించారు. ఒక కుటుంబాన్ని కలపాలనుకుంటున్నారా? లేక విడదీయాలనుకుంటున్నారా? తమ్ముళ్ల మధ్య అగ్గిరాజేసి విడదీయాలని చూసిన వారందరూ నాశనం అవుతారు. మీ కర్మ మీరే అనుభవిస్తారు" అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Latest News