|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 03:19 PM
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో ఘన విజయం సాధించిన తమిళ యువ దర్శకుడు అబిషన్ జీవింత్ ఈరోజు పెళ్లి చేసుకున్నాడు. అబిషన్ తన చిరకాల స్నేహితురాలు అఖిల ఇళంగోవన్‌తో చెన్నైలో వారి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. హనురెడ్డి బోట్‌హౌస్ గార్డెన్‌లో సంప్రదాయబద్ధంగా వివాహం జరగగా, చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్‌లో రిసెప్షన్ నిన్న రాత్రి జరిగింది. శశికుమార్, సిమ్రాన్, శివకార్తికేయన్, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్ వంటి పలువురు సినీ ప్రముఖులు, ఇతర చిత్ర నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఈ వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించారు. వివాహ కానుకగా టూరిస్ట్ ఫ్యామిలీకి చెందిన నిర్మాత అబిషన్‌కు ఇటీవల విలాసవంతమైన BMW కారును బహుమతిగా ఇచ్చారు. వీరికి అభిమానులు, నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ జంట పెళ్లి ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
Latest News