|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 06:49 PM
అత్యంత ప్రశంసలు పొందిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ దాని యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడవ సీజన్‌తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. మనోజ్ బజ్‌పేయీ తన ఐకానిక్ పాత్రలో శ్రీకాంత్ తివారీగా కనిపించనున్నారు. చాలా కాలంగా, సినీప్రియులు మూడవ విడత కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని నవంబర్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నవంబర్ 21 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ప్రియమణి, షరీబ్ హష్మీ, శరద్ కేల్కర్, ఆశ్లేషా ఠాకూర్ మరియు నీరజ్ మాధవ్ కూడా నటించారు.
Latest News