|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 04:57 PM
పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'థమ్మా' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. సెప్టెంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 100 కోట్ల క్లబ్ లో చేరింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 9వ రోజు (అక్టోబర్ 29న) ఈ చిత్రం కేవలం రూ. 3.25 కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమా మొత్తం వసూళ్లు రూ. 104.60 కోట్లకు చేరాయి. రెండో బుధవారం హిందీలో ఈ చిత్రానికి 10.10% ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలకు 6.28% ఆక్యుపెన్సీ ఉండగా, రాత్రి షోలకు అత్యధికంగా 13.96% నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి.ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ మ్యాడాక్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు. 'స్త్రీ', 'స్త్రీ 2', 'భేదియా', 'ముంజ్యా' చిత్రాల తర్వాత మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో వచ్చిన ఐదో సినిమా ఇది. ఇందులో అలోక్ గోయల్ అనే జర్నలిస్టు పాత్రలో ఆయుష్మాన్ ఖురానా నటించగా, రక్తపిశాచి (వాంపైర్) అయిన తాడక పాత్రలో రష్మిక మందన్న కనిపించింది. వీరిద్దరి మధ్య నడిచే విభిన్నమైన ప్రేమకథే ఈ సినిమా.ఈ చిత్రం తన కెరీర్‌లోని అతిపెద్ద కమర్షియల్ హిట్స్‌లో ఒకటిగా నిలవడంపై హీరో ఆయుష్మాన్ ఖురానా ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా పిల్లలను బాగా ఆకట్టుకోవడం తనను ఎంతగానో సంతోషపరిచిందని ఆయన అన్నారు.
Latest News