|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 07:28 PM
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్‌లో రెండు భారీ చిత్రాలను నిర్మించనున్నారు. మొదటి చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ ఖాన్ నటించనున్నారు. ఈ చిత్రానికి సల్మాన్ భారీ పారితోషకం తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఇంకో చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం" కూడా హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇది కూడా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.
Latest News