|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 03:05 PM
నాని కసరగద్ద దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ '12 ఎ రైల్వే కాలనీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ రాసిన ఈ చిత్రం యొక్క టీజర్ మూవీ పై భారీ అంచనాలు పెంచింది. ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని కన్నోదిలి కలనొదిలి అనే టైటిల్ తో విడుదల చేసారు. భీమ్స్ సెసిరోలియో కంపోస్ చేసిన ఈ సాంగ్ కి హేషమ్ అబ్దుల్ వహాబ్ తన గాత్రాణి అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో కామక్షి భాస్కర్లా, సాయి కుమార్, హర్షా మరియు ఇతరలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ కింద శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో సాయి కుమార్, గెటప్ శ్రీను, జీవాన్ కుమార్, అనిష్ కురువిల్లా మరియు ఇతరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో ట్యూన్లను కంపోజ్ చేస్తున్నారు.
Latest News