|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 11:19 AM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. "తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తున్నాను." అని ట్వీట్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ కాలికి గాయం కావడంతో హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇవాళ సాయంత్రం హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఫాంహౌజ్‌లోని బాత్రూములో కాలుజారి పడిపోవడంతో తుంటి ఎముక విరిగిపోయినట్లు సమాచారం.దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
మాజీ సీఎం కేసీఆర్ కాలికి గాయం కావడంతో హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. యశోద ఆస్పత్రి వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు. దీంతో అధికారులు యశోద ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.