|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 11:42 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డి ముందుగా హామి ఇచ్చినట్టుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించారు.ఈ పథకం డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం అమలులోకి వస్తే రూ. 4 కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంది.ఆర్టీసీకి సగటున రూ. 14 కోట్ల రాబడి వస్తోంది.. ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలే ఉంటారు కాబట్టి ఇప్పుడు నష్టం జరగనుందని తెలిపారు. అయితే ఈ విషయంపై ఆయన నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుందన్న విషయం తెలిసిన ప్రజలు చాలా సంతోష పడుతున్నారు.