|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 12:04 PM
నేటి నుంచి ప్రజాదర్బార్ జరగనుంది. ఈరోజు ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. ప్రజాదర్బార్‌లో పాల్గొనేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో ఇవాళ ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. అర్జీలు అందించిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీపైనా సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలపై నేడు చర్చించనున్నారు.