|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 12:40 PM
జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కు 20 మంది అధికారుల బృందం పని చేస్తుంది. మళ్లీ వాటి పరిష్కారం పై ప్రతి నెల ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ప్రజా దర్బార్ తో సమస్యలు పరిష్కారం అవుతాయని అక్కడికి వచ్చిన బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో ఇవాళ ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. అర్జీలు అందించిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీపైనా సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలపై నేడు చర్చించనున్నారు.