by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:40 PM
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం 1, II, వెనుకవడిన తరగతుల బాలుర వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారము వసతి గృహాలను ఆకస్మిక తనిఖి చేసి మాట్లాడుతూ హాస్టల్స్ లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. పరిసరాలు పరిశుబ్రంగా ఉండే విదంగా పర్యవేక్షణ చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశించారు .వంటగది లో బియ్యం, పప్పులను, కూరగాయలు, పరిసరాలను పరిశీలించారు. ప్రతి రోజు కొత్త మెనూ ప్రకారం వండాలన్నారు, ప్రతి రోజు టిఫిన్, భోజనం ఎలా పెడుతున్నారని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార విషయంలో శుచి, శుభ్రత పాటించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాత్ రూమ్ లు. టై లెట్స్ ను పరిశీలించి ,పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పర్యవేక్షణ చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు. చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
వసతి గృహాలలో ఫ్యాన్ లు, లైట్స్ , మేజర్ ,మైనర్ రిపెర్ పనులు ఎంత వరకు పూర్తి చేసారని వార్దేన్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని పనులు పూర్తి చేసి రిపేర్ కు ముందు పొటోలు, తర్వాత పొటోలు పంపించాలని తెలిపారు. విద్యార్థులు చదువుతున్న క్లాస్ రూమ్ కి వెళ్లి చదువుతున్న తీరును పరిశీలించారు. 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు అందరు బాగా చదివి పరీక్షలో ఉతీర్ణత సాదించాలన్నారు. ఈ తనిఖి కార్యక్రమంలో షెడ్యుల్డ్ కులాల అభివృధి అధికారి మల్లేశం, వార్డెన్లు రత్నం, రవీందర్ ,సుక్రవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.