by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:48 PM
పరిహార అటవీ పెంపకంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అటవీ, రెవెన్యూ అధికారులతో పరిహార అటవీ పెంపకం, అడవుల సంరక్షణ పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అటవీయేతర అవసరాల కోసం మళ్లించిన అటవీ భూమికి పరిహారంగా అడవుల పెంపకం చేయాలన్నారు. జిల్లాలో సుమారు 1500 హెక్టార్ల అటవీ భూమి డైవర్షన్ కు గురయ్యిందని ఆయన తెలిపారు. అటవీ భూమిని అసైన్డ్ పట్టాల పంపిణీ చేసిన వివరాలు అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సరిచూసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు అటవీ భూములు పోనూ, గుట్టలుగా అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.