by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:53 PM
పార్లమెంటులో అంబేద్కర్ ను అవమాన పరచిన అమిత్ షాను కేంద్ర హోం మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమిత్ షా ఒంటినిండ మనువాద భావాజాలాన్ని నింపుకొని అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడడం దేశ ప్రజల ఆత్మగౌరవన్ని కించపరచడమేనని అన్నారు.
భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికై ఒక బాధ్యత గల పదవిలో ఉండి అంబేద్కర్, అంబేద్కర్ అని అవహేళన చేయడం అమిత్ షాకు తగదని, ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టిపిసిసి జనరల్ సెక్రెటరీ కర్నాల శ్రీనివాసరావు, నాయకులు ఎర్రన్న, నర్సింహారెడ్డి, గంగులు తదితరులు పాల్గొన్నారు.