by Suryaa Desk | Sat, Dec 21, 2024, 01:52 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.శాసనసభలో ఆయన మాట్లాడారు. ''మేం ఇచ్చిన నోట్‌లో రైతు భరోసాపై ఏమీ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగిన విధివిధానాలే సభ ముందు ఉంచాం. భారాస ఏది చెబితే.. అది అమలు చేయాలనే ఆలోచన వారికి ఉంది. ఏ పంటకు ఎంత ఇస్తామనేది ఇంకా నిర్ణయించలేదు. సభలో సభ్యుల సూచనల తర్వాతే నిర్ణయిస్తాం.పత్తి, చెరకుకు ఏం చేయాలనేది సభ్యులు చెబితే.. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రైతుబంధులో కోతలు విధిస్తామని మేం చెప్పలేదు. ప్రజలు, సభ్యుల అభిప్రాయం ప్రకారం విధివిధానాలు నిర్ణయిస్తాం'' అని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.