by Suryaa Desk | Sat, Dec 21, 2024, 03:15 PM
నారాయణపేట పట్టణంలోని కేజీబీవీ పాఠశాల ముందు శనివారం విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చేపట్టారు. పది రోజులుగా ఉపాద్యాయులు సమ్మెలో వుండటంతో క్లాసులు జరగడం లేదని, తమ పిల్లలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళనకు పి డీ ఎస్ యు, ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. యాదగిరి వెళ్ళే రోడ్డుపై బైఠాయించారు. సమ్మెలో వున్న ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.