by Suryaa Desk | Thu, Dec 26, 2024, 04:04 PM
నాగల్గిద్దా మండల ఎనక్ పల్లి నుండి మావినెల్లి తండా మార్గన గల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణీకులు , గ్రామస్తులు రాత్రి వేళల్లో ఈ రోడ్ల గుండా ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. ఎమ్మెల్యే సారూ.. ఒక్కసారి మా ఊరి రోడ్డు పరిస్థితి చూడండని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరలు అధికారంలో ఉండి కానీ కనీసం మా ఊరి రోడ్డు గురించి పట్టించుకోలేదు కానీ ఎక్కడ దాని గురించి మాట్లాడలేదు రోడ్డు మొత్తం ధ్వంసంమై రోడ్డు మొత్తం కంకర తేలింది మా ఊరి నుండి మావినెల్లి తండామైన రోడ్డు వెళ్లడానికి 5 కిలోమీటర్లు మాత్రమే ఉండి కానీ రోడ్డు సరిగా లేక గ్రామస్తులు చాలా అవస్థలుపడుతున్నారు.
ప్రభుత్వలు మారిన ఎమ్మెల్యే లు మారిన మాఊరి రోడ్డు పరిస్థితి మాత్రం మారడంలేదు సారూ ప్రజలపాలన ప్రభుత్వంలో నైనా మాఊరి రోడ్డు బాగుచేయించండి ఎమ్మెల్యే సారూ.. తప్పు ఎవరిదీ ఉన్నత అధికారులదా లేక ఊరిలో ఉన్న ప్రజలదా ఊరిలో ఉన్న పార్టీ లీడర్ లదా.. రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు బయడుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. సీఎం సారూ తో మాట్లాడి మాఊరి రోడ్డును బాగుచేయించండి సారూ రాత్రి పూట ప్రయాణం చేయాలనంటే వాహనదారులు భయపడుతూన్నారు. ప్రమాదం ఎప్పుడు ఎ రూపంలో వస్తుందోనాన్ని గ్రామస్తులు బయపడుతున్నారు. మా ఊరికి రోడ్లు బాగా చేయించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.