by Suryaa Desk | Thu, Dec 26, 2024, 04:07 PM
కులమతాలు ఏవైనా లోక కళ్యాణమే ప్రతి ఒక్కరి అభిమతం కావాలని చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ అన్నారు. మండలంలోని ఆలూర్ గ్రామంలోని చర్చిలో బుధవారం ఎల్ జేసీజీపీఎం క్రీస్తు సంఘం వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన క్రైస్తవ పెద్దలతో కలిసి క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆర్ఎంపీ వైద్యుడు వినయ్ కుమార్, పాస్టర్లు తిమోతి, అనోక్ లతో కలిసి ఆయన చేతుల మీదుగా పలువురు ప్రజలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు లోక కళ్యాణం కోసం పాటుపడ్డారన్నారు. ఆయన బోధనలు మానవాళికి మార్గదర్శకమని, అందరు ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ భక్తులు కొండా మల్లేశం, నర్సింగ్ రావు, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.