by Suryaa Desk | Thu, Dec 26, 2024, 04:09 PM
వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధన పాటించాలని కోదాడ పట్టణ సీఐ రాము అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు 35, ఆటోలు 33 పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.
ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలతో పాటు సంబంధిత పత్రాలు నెంబర్ ప్లేట్లు కన్ఫామ్ గా ఉండాలని లేని పక్షంలో వాహనాలు సీజ్ చేయటం జరుగుతుందన్నారు. ఆటోలలో పరిమితి మించి వాహనాలు నడపొద్దని ఆటోలో సౌండ్ సిస్టం ఉండొద్దని అన్నారు. ఆయన వెంట పట్టణ ఎస్సై సైదులు, ఏఎస్ఐలు రమేష్, కేపీ చారి, హెడ్ కానిస్టేబుల్ మండవ హుస్సేన్ గౌడ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.