by Suryaa Desk | Thu, Dec 26, 2024, 04:11 PM
బొల్లారం మున్సిపల్ పరిధిలో మాజీ ప్రధానమంత్రి,భారత రత్న అవార్డు పొందిన మహా నాయకుడు అటల్ బిహారీ వాజపేయి జయంతి వేడుకలను సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి డి. స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ ఈ మహానాయకుడి పుట్టినరోజును డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించిందని గుర్తుచేశారు.ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చిి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని అన్నారు. ఆ మహానాయకుడి జయంతి సందర్బంగా మొక్కను నాటడం జరుగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నర్సిరెడ్డి, వీరారెడ్డి మైలారం, శివ రెడ్డి, వీరారెడ్డి మల్లబాద్, నర్సమ్మ, నవీత మల్లబాద్ , నవీత కానగడ్డ తదితరులు ఉన్నారు..