by Suryaa Desk | Fri, Dec 27, 2024, 11:04 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ..కనిష్ఠాల వద్ద మదుపర్ల కొనుగోలు సూచీల సెంటిమెంట్‌ను బలపర్చాయి. దీంతో నేటి ట్రేడింగ్‌ను మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టింది. నిఫ్టీ 23,800 మార్క్ పైన కదలాడుతోంది.ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 323 పాయింట్లు పెరిగి 78,806 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 23,854 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జొమాటో, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్‌మహీంద్రా, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, టైటాన్, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.21 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,652.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి 85.34 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గానే కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా షేర్లను విక్రయిస్తూనే ఉన్నారు. క్రమంగా ఎనిమిదో రోజు గురువారం కూడా నికరంగా రూ.2,377 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,336 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.