![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 06:17 PM
సత్తుపల్లి నియోజకవర్గం, జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు రావడానికి తనకు సహకారం అందించిన ముఖ్యుల్లో గాదె సత్యం ఒకరని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేత, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తన ముఖ్య అనుచరుడు, రాజకీయ నిర్దేశకుడు గాదె సత్యం సంతాప సభలో మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు.తనకు గాదె సత్యం ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. సత్యం మృతి బాధాకరమని కంటతడి పెట్టారు. ఆయన సలహాలు, సూచనలకు అనుగుణంగా తన రాజకీయ నడవడిక జరిగిందని తెలిపారు. ఆయన లేకపోవడం తన భవిష్యత్తు రాజకీయాలకు, వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అని మంత్రి అన్నారు.