![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 08:42 PM
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి ఒకరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.దీంతో, కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు.వీరితో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, నిబంధనల మేరకు లేవంటూ రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటి సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. గడువు ముగిసేవరకు ఐదు నామినేషన్లు మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.