![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 10:20 AM
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగనున్నది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇవాళ ఆరు ప్రభుత్వ బిల్లులు(ఎస్సీ వర్గీకరణతో పాటు మరో ఐదు బిల్లులు) ప్రవేశపెట్టనున్నారు. కాగా, సభలో నేడు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా 15శాతం రిజర్వేషన్ అమలవుతున్నది. ఆ కోటాలో మాలలే ఎకువగా లబ్ధిపొందుతున్నారనే చర్చ 1970 దశకంలోనే మొదలైంది. అది క్రమేణా ఊపందుకున్నది. వాస్తవంగా జనాభాపరంగా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎకువైయినప్పటికీ, విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తకువ స్థాయిలో ఉన్నారనేది వర్గీకరణ ఉద్యమానికి మూలం. తమకు అన్యాయం జరుగుతున్నదని మాదిగల పోరాటంతో ఎట్టకేలకే ఈ అంశంపై 1995లో ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. మాదిగల వాదన నిజమేనని సమర్థిస్తూ ఆ కమిషన్ 1996లో తన నివేదికను సమర్పించగా, దాని ఆధారంగా 1997 జూన్‌లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను ఏ, బీ, సీ, డీగా వర్గీకరిస్తూ జీవో విడుదల చేసింది.