![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:33 PM
కొటకొండ, గార్లపాడు గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మంగళవారం హైద్రాబాద్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వినతి పత్రం అందించారు.
మండలాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. పరిశీలించి మండలాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. కొటకొండ గ్రామ ప్రజలు నర్సయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.