![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 04:08 PM
హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో విషాదం జరిగింది. అబ్దుల్ జమిర్ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి భార్య, అత్త వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే స్నేహితుల వివరాల ప్రకారం.. భార్య, అత్త వేధింపుల కారణంగానే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని.
ఆ సమయంలో ఇంట్లో భార్య, అత్త ఉన్నారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే అనంతపురంకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు.