|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:06 PM

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కాలేదని, ఎస్సీ వర్గాలకు తాను సీఎంగా ఉన్నప్పుడే న్యాయం చేయాలని బలంగా నమ్మానని పేర్కొన్నారు.