|
|
by Suryaa Desk | Sat, Mar 22, 2025, 08:24 PM
కూకట్‌పల్లి 7వ ఫజ్‌లో గల గీతాంజలి మోడల్ స్కూల్‌లో శనివారం ఎకాడమిక్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యార్ధులు పలు పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ ప్రదర్శనలో విద్యార్ధులచే తయారు చేయబడిన పరికరాలు చూపరులను ఆకర్షించగా వాటి ఉపయోగాలను విద్యార్ధులు సందర్శకులకు తెలిపిన విధానం అందరిని ఆకట్టుకుంది.దీనిపైగీతాంజలి మోడల్ స్కూల్ కరస్పాండెంట్ రవిబాబు మాట్లాడుతూ విద్యార్ధుల ప్రతిభకు ఇలాంటి ప్రదర్శనలు అద్దం పడతా యని వా రి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.. ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. ఈ ఎక్స్‌పో విజయానికి స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్ధుల కష్టం చా లా అభినందనీయమని వా రికి సహకరించిన విద్యార్ధుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవా దాలు తెలిపారు. విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్‌కు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పర్కొన్నారు.