|
|
by Suryaa Desk | Mon, Mar 24, 2025, 11:26 AM
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలుకొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.150 తగ్గి రూ.82,150గా ఉంది. 24 క్యారెట్ల 10గ్రా. గోలడ్ రేటు రూ.160 తగ్గి రూ.89,620కి చేరింది. అలాగే వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ ధర రూ. 1,09,900గా ఉంది.బంగారం ధరలు శుక్రవారం నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ. 220 మేరకు పెరిగి, రూ. 90,660కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి, రూ. 83,100 అయింది. అయితే, శుక్రవారం 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేట్ ముందు రోజు కంటే రూ. 440 మేరకు తగ్గి రూ. 90,220కి దిగొచ్చింది.