![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 05:10 PM
ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనను చూపిస్తూ బీఆర్ఎస్ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని ఆయన స్పష్టం చేశారు.గత బీఆర్ఎస్ హయాంలో దిశ ఘటన జరిగిందని, వామనరావు దంపతులను నడిరోడ్డుపై నరికి చంపారని గుర్తు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో బీఆర్ఎస్ నాయకుడి కుమారుడు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. యువతను వ్యసనాలకు బానిస చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆయన దుయ్యబట్టారు