![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 08:30 PM
రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దుర్ఘటన బుధవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పోలంపల్లికి చెందిన ఈసం వినీత్ పనిమీద బైక్‌పై కారేపల్లికి వెళ్తున్నాడు. బస్టాండ్ వైపు నుండి సినిమా హాల్ సెంటర్‌కు వెళ్తుండగా ఎదురుగా రాంగ్ రూట్‌లో కంకర లోడుతో వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతొ బైక్‌పై ప్రయాణిస్తున్న వినీత్ తలకు తీవ్రగాయం కాగా స్థానికులు కారేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం 108 సహాయంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.