![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 08:43 PM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తున్నట్లు వస్తున్న ప్రచారం నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ అధ్వర్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం ఆత్మబలి దానాలు చేసుకుంటున్న క్రమంలో తల్లి సోనియా గాంధీ ఒప్పించి వెంటనే తెలంగాణను ప్రకటించేందుకు కృషి చేశారని ఆమె రుణం తీర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందని అన్నారు . అందులో భాగంగా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కల్పిస్తే ఆనాడు ఆయన చేసిన పోరాటాన్నికీ గుర్తించి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని అందుకోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలోనే ఆయనకు మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు . రాజగోపాల్ రెడ్డికి మంత్రిగా అవకాశం దక్కడంతో మునుగోడు నియోజకవర్గం తోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.