![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 30, 2025, 10:03 AM
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు చెందిన న్యూట్రిఫుల్ యాప్, ఈ సంవత్సరం జరిగిన స్కోచ్ అవార్డులలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందించారు. నారా భువనేశ్వరి మరియు న్యూట్రిఫుల్ బృందానికి అభినందనలు అంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. అందరికీ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని, వారికి మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈ యాప్‌కు 4 లక్షలకు పైగా ఎన్‌రోల్‌మెంట్‌లు ఉన్నాయని. ఆరోగ్య సంరక్షణ ముఖ్య ఉద్దేశంగా ఇది పనిచేస్తూ, 4 లక్షలకు పైగా ఉచిత సంప్రదింపులు మరియు ఆహార ప్రణాళికలను అందిస్తోందని చంద్రబాబు వివరించారు. అత్యాధునిక ఫుడ్ స్కానర్‌తో సహా తాజా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్న ఈ యాప్‌కు శిక్షణ పొందిన న్యూట్రిషనిస్టుల బృందం మద్దతు ఇస్తోందని వెల్లడించారు. న్యూట్రిఫుల్ యాప్ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో విశేషమైన ముందడుగు వేస్తోందని వివరించారు.