![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 30, 2025, 10:21 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది రోజున సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.కాగా శనివారం రంజాన్ పర్వదినాల సందర్భంగా సొంత నియోజకవర్గమైన కొడంగల్ వెళ్లి ఇఫ్తార్ విందులో స్థానిక ముస్లిం ప్రజలతో కలిసి పాల్గొన్నారు. నియోజక వర్గ సమస్యలపై స్థానిక నేతలతో చర్చించి వినతి పత్రాలు సేకరించారు.