![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 11:35 AM
పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం, ఉపవాసం, ప్రార్థన, దానం, సేవా స్పూర్తి వంటి అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.త్యాగం, కరుణ, శాంతి, ప్రేమ, సామరస్యాన్ని చాటే రంజాన్ పండుగను క్రమశిక్షణతో, ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన ముస్లీంలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముస్లిం సమాజ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.