![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 10:49 AM
అపర భద్రాద్రిగా పేరొందిన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుండి జరుగనున్నాయి. ఈ సంధర్భంగా సోమవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీతారాముల కల్యాణం, బ్రహ్మోత్సవాలు పోస్టరును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి, ప్రజా ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.