|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 04:52 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీ నగర్ చెరువుకట్టపై ఒక థార్ వాహనం బీభత్సం సృష్టించి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. అతివేగంతో అదుపుతప్పిన వాహనం పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన సంభవించింది.వివరాల్లోకి వెళితే, బీబీ నగర్‌లోని చెరువుకట్టపై వేగంగా వస్తున్న ఒక థార్ వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పింది. దీంతో అక్కడ ఉన్న పలువురిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందాడు. అదే సమయంలో వాహనం ఢీకొట్టిన ధాటికి మరో యువతి సమీపంలోని చెరువులో పడిపోయింది. నీటిలో మునిగి ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది.ఈ అనూహ్య ఘటనతో చెరువుకట్ట ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.