|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 08:58 PM
తెలంగాణలో రేపటి నుంచి ప్రైవేట్ కళాశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ప్రైవేట్ కళాశాలలకు సంబంధించిన రూ.900 కోట్ల బకాయిలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వచ్చే మూడు రోజుల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు మొత్తం రూ.1,500 కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రభుత్వానికి తెలియజేశాయి. ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశామని, మరో రూ.600 కోట్లు మూడురోజుల్లో చెల్లించనున్నట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మిగతా రూ.300 కోట్లు కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని తెలిపారు.ఎంపీకి బురుడి.. రూ.56 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు.ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థలో సంస్కరణల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ కమిటీలో అధికారులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు కూడా ఉంటారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తమ బకాయిలు విడుదల చేయాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. నిధులు ఆలస్యమవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 3 నుంచి కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రైవేట్ కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. మొదట రూ.600 కోట్లు విడుదల చేసి, మిగతా రూ.300 కోట్లు త్వరలో చెల్లిస్తామని భట్టి భరోసా ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ప్రైవేట్ కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.