|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 11:09 AM
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ లు కలిసి కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహించారుగురువారం ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇద్దరు నేతలు కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.మున్సిపాలిటీ పరిదిలో వార్డు నంబర్ 15 బచ్చుగుడా లో కాంగ్రెస్ అభ్యర్థి సరితను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారెంటీలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. పటాన్ చెరు ప్రాంత అభివృద్ధి కి కాంగ్రెస్ ప్రత్యేక ప్రణాళిక తో ముందుకు సాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఇంద్రేశం మున్సిపాలిటీకి రూ.15 కోట్ల ప్రత్యేక నిధులను అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఆ నిధులతో ప్రజల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తూ పనులు ప్రారంభిస్తామని వివరించారు.అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి చెయ్యి గుర్తు పై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు కరుణాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కిష్ట రెడ్డి, వెంకట్ రెడ్డి, 40 మంది తదితరులు కాంగ్రెస్ లో చేరారు. వారికి నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..