|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 11:58 AM
నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక్కో మున్సిపాలిటీకి ఒకరిద్దరు చొప్పున కోఆర్డినేటర్లను నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్‌గా ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డిని నియమించారు. చండూరు మున్సిపాలిటీకి పీసరి మహిపాల్‌రెడ్డి, హాలియాకు నాగసీతారాములు, దేవరకొండకు కొట్నాల తిరుపతి నియమితులయ్యారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి కుందూరు రఘువీర్‌రెడ్డి, పొట్ల నాగేశ్వర్‌రావు, నందికొండ మున్సిపాలిటీకి మద్ది శ్రీనివాస్‌రెడ్డి, హుజూర్‌నగర్‌కు నూతి శ్రీకాంత్‌గౌడ్, నేరేడుచర్లకు ముత్తినేని వీరయ్య, కోదాడకు ఇ.సుబ్బారావు, సూర్యాపేటకు కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, భువనగిరికి ఎం.పరమేశ్వర్‌రెడ్డి, చౌటుప్పల్‌కు కస్బ శ్రీనివాసరావు, పోంచపల్లికి కె.శ్రీకాంత్‌యాదవ్, తిరుమలగిరికి కె.రవళిరెడ్డి, మోత్కూరుకు బొజ్జ సంధ్యారెడ్డి, ఆలేరుకు జి.శశికళయాదవ్‌రెడ్డి, యాదగిరిగుట్టకు ఎం.సత్యనారాయణ గౌడ్, చిట్యా లకు గౌరిసతీష్‌ను నియమించారు.