|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 12:15 PM
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఒక ఇంట్లో చొరబడి విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దొంగలు ముందుగా ఇంటి వద్ద ఉన్న వాచ్‌మెన్‌కు మత్తుమందు ఇచ్చి, అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఇంట్లోకి ప్రవేశించారు. లాకర్‌లోని బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దొంగలు నగరం విడిచి వెళ్లకుండా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఈ తరహా నేరాలకు పాల్పడిన పాత నేరస్థుల జాబితాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నగరంలో నేపాలీ గ్యాంగ్‌ల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పని మనుషులు, వాచ్‌మెన్‌లను నియమించే సమయంలో వారి ఆధార్ కార్డులు, పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని పోలీసులు సూచిస్తున్నారు.