|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 12:43 PM
కామారెడ్డి జిల్లా బిచ్కుందా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి, పార్టీ అభ్యర్థులకు మద్దతు కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో మొత్తం 1005 నామినేషన్లు దాఖలు కాగా.. సగానికి పైగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని 92 వార్డులలో 447 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.